కన్నుల పండువగా శ్రీశ్రీశ్రీ వీరాంజనేయస్వామి వారి రథోత్సవం

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం, తవలం గ్రామం నందు స్వయంభుగా వెలసిన శ్రీశ్రీశ్రీ వీరాంజనేయస్వామి వారి రథోత్సవం కన్నుల పండువగా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన అశేష భక్తజన సందోహంతో, ఆహ్లాదకర వాతావరణంలో జై శ్రీరామ్ జై హనుమాన్ అనే హర్షద్వానాలతో, యువత కేరింతల, రంగుల రంగేలి, భక్తి పాటల కోలాహలం నడుమ స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవం వేడుకకు సినీ ఆర్ట్ డైరెక్టర్ సాహీ సురేష్ & వారి కుటుంబ సభ్యులు ఉత్సవ ఉభయదారులుగా వ్యవహరించి ఆలయ కార్య నిర్వహణ అధికారి, ఆలయ కమిటీ సభ్యులు సహకారంతో ఏర్పాట్లు కల్పించారు. రథోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందిస్తూ ఆ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు కలగాలని, గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారికి హోమం నిర్వహించి అనంతరం స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, బాలసముద్రం జనసేన పార్టీ ఎంపీటీసీ అమర్ కార్తికేయ, తనకల్లు మండల జనసైనికులు పాల్గొన్నారు.