జనచైతన్య శంఖారావం 14వ రోజు

రాజమండ్రి రూరల్, జనచైతన్య శంఖారావం కార్యక్రమం 14వ రోజు ధవళేశ్వరం రధం వీధి నుంచి ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన మొదటి నుంచి యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. స్థానిక రధం వీధివాసులు హారతులతో స్వాగతం పలికారు. ఇక్కడ స్థానికులు కొన్ని సమస్యలను వివరించడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీ వారు ఈ ప్రాంతంలో రెగ్యులర్గా డస్ట్ బిన్స్ క్లియర్ చేయరని దానివల్ల చెత్త రోడ్డు మీదకు వచ్చేసి పందులు గేదెలు వాటిని పాడు చేయడం జరుగుతుందని వాపోయారు, అంతేకాకుండా ఒక వ్యక్తికి బ్రతికుండగానే చనిపోయినట్టు చూపించి ఆధార్ కార్డు తొలగించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలను వివరించడం జరిగింది. దుర్గేష్ మాట్లాడుతూ మీ సమస్యలను పంచాయతీ వారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని లేనియెడల అతి తొందరలోనే జనసేన పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని అప్పుడు మీ సమస్యలను ఒక ప్రణాళిక బద్ధంగా తీరుస్తానని దుర్గేష్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడ్ల మహేష్ వెంకటేష్ సింగిరెడ్డి సత్తిబాబు, దిండి జగదీష్, అల్లంపల్లి ముత్యాలు, అల్లంపల్లి వాసు, గీతా బాబి, ఏసు, రెడ్డి కార్యదర్శి బీరా ప్రకాష్, కార్యదర్శి అమీనా, సూరాడ సత్తిబాబు, సికోటి శివాజీ, మట్టపర్తి నాగరాజు, శివారెడ్డి, విజ్జిన శివ, అడపా హరీష్, అన్నందేవుల మోహన్ తదితరులు పాల్గొనడం జరిగింది.