హనుమంత వాహనంపై శ్రీనివాసుడు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామివారు వేంకటాద్రిరాముని అలంకారంలో అనుగ్రహించారు. పండితుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో ఆస్థానాలను వేడుకగా నిర్వహించారు.

కాగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథం బదులుగా సర్వభూపాల వాహనసేవ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు కటాక్షిస్తారు.