టెక్సాస్‌, ఫ్లోరిడా లో విజయకేతనం

అమెరికా ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటిదాకా జో బైడెన్ ఆధిక్యంలో ఉన్నా అనూహ్యంగా ట్రంప్ లీడింగ్‌లోకి వస్తుండటం ఆసక్తి రేపుతోంది. ఫ్లోరిడాలో ట్రంప్‌ విజయం సాధించారు. టెక్సాస్‌లో సైతం ఆయనే గెలుపొందారు. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలంటే ఈ రెండు రాష్ట్రాలు కీలకమని ముందు నుంచీ భావిస్తున్న విషయం తెలిసిందే. కౌంటింగ్‌ ప్రారంభం నుంచి దాదాపు ట్రంపే ముందంజలో కొనసాగారు. కానీ, ప్రతర్థి బైడెన్‌కూ, ట్రంప్‌కు మధ్య స్వల్ప తేడా ఉండడంతో ఆసక్తి రేకెత్తించింది. ఇక ఈ రెండూ ఆయన వశం కావడంతో ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లతో ముందు నుంచి దూసుకెళ్తున్న బైడెన్‌కు చేరువయ్యారు. వీటికి తోడు కొత్తగా మోంటానా, ఒహైయో, న్యూజెర్సీలోనూ విజయం సాధించారు. ఇంకా లెక్కింపు కొనసాగుతున్న కీలక రాష్ట్రాల్లోనూ ట్రంప్‌ ఆధిక్యంలో ఉండడం విశేషం. విస్కాన్సిన్‌, మిషిగాన్‌, పెన్సిల్వేనియా, జార్జియాలోనూ ఆయన హవానే కొనసాగుతోంది. ఇప్పటి వరకు ట్రంప్‌ 213 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు సాధించగా.. బైడెన్‌ 225 ఓట్లు గెలుపొందారు.