*లేపాక్షి షోరూముల విస్తరణపై మంత్రులకు డా. పసుపులేటి హరి ప్రసాద్ వినతి
అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరి ప్రసాద్ బుధవారం సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ని, పౌర సర్ఫరాల మంత్రివర్యులు, జనసేన స్టేట్ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, టెర్రకోట కళాకారులు ఇటీవల వ్యక్తీకరించిన సమస్యలు, అవసరాలను వారికి వివరించారు. వారిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ మద్దతు అవసరమని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా, రాష్ట్రంలోని ప్రతి ప్రముఖ పర్యాటక క్షేత్రంలో లేపాక్షి షోరూములు ఏర్పాటు చేయాలని కోరారు. ఇది రాష్ట్ర సాంప్రదాయ కళలకు ప్రోత్సాహం కల్పించి, స్థానిక కళాకారులకు మార్కెట్ అవకాశాలు తెస్తుందని తెలిపారు.

Share this content:
Post Comment