Supreme Court : లఖింపూర్‌ కేసుపై నేడు విచారణ

ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్‌ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. నిరసన తెలుపుతున్న రైతులను కారుతో తొక్కించిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వ్యతిరేకతను ఎదుర్కొన్న కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆదేశాలివ్వాలంటూ మీడియా, న్యాయవాదుల సంఘం సుప్రీంకు లేక రాశాయి. మరోవైపు యుపి పోలీసుల విచారణపై ప్రజల నుండి వ్యతిరేకత ఎదురుకావడంతో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. రైతులను కారుతో తొక్కించిన మంత్రి కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదంటూ రైతులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన కుమారుడు ఆ ప్రాంతంలో లేడంటూ కేంద్రమంత్రి బుకాయిస్తున్నారు.