తాడి ఏసు, సత్యలను పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, మోరిపోడు గ్రామానికి చెందిన తాడి ఏసు, సత్యల తండ్రి కాలం చేయడం జరిగింది. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు గుండుబోగుల పెద్దకాపు, డాక్టర్ రమేష్ బాబు, రావూరి నాగు, జక్కంపూడి శ్రీనివాస్, బోణం భాస్కర్, అడ్డాల నరేష్ కలసి ప్రగాఢ సానుభూతిని తెలియచేయడం జరిగింది.

లంకలపల్లి సత్యనారాయణను పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లిలో లంకలపల్లి సత్యనారాయణ కుమారుడు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు రావూరి నాగు, ఉండపల్లి అంజి, నామన నాగభూషణం తదితరులు కలసి ప్రగాఢ సానుభూతిని తెలియచేయడం జరిగింది.