శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న తంగెళ్ళ ఉదయ్

పిఠాపురం నియోజకవర్గంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో లక్ష్మి నర్సాపురం గ్రామంలో అమ్మవారి బోనాలు జాతర అంగరంగ వైభవంగా గ్రామస్థులు నిర్వహించిన కార్యక్రమనికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ హాజరవడం జరిగింది. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు మరియు భవానీ మాలధారణ చేసిన భక్తులుతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి అమ్మవారి కమిటీ వారికి 10,000 రూపాయలు చందాను ప్రకటించి గ్రామస్థులు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసారు.

  • పలు అన్నదాన కార్యక్రమాలు

వెల్దుర్తి మరియు దుర్గాడ గ్రామాలలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి అన్నదాన కార్యక్రమాలలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ముందుగా అమ్మవారి విగ్రహాలను దర్శనం చేసుకుని కమిటీ వారికి విరాళాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమములో పాల్గొని ఉత్సాహంగా గ్రామస్థులకు వడ్డిస్తూ వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన నాయకులు జ్యోతుల శ్రినివాసు మరియు నాయకులు, వీరమహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.