టీడీపీ, జనసేన ఇంటింటా ప్రచారం

మదనపల్లెలో జనసేన, టీడీపీ ఇంటింటా ప్రచారం 35 రోజు ప్రచారంలో భాగంగా కోళ్ల బైలు పంచాయతీలోని బాబు కాలనీలోని ప్రాంతాల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజలు రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మిట్ట ప్రాంతాల్లో నివసిస్తున్న వారు దిగువ నుండి నీళ్ళు తీసుకొని పోవడానికి రోడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులకు భూమి వుంది అన్న సాకు తో ఫంక్షన్ రద్దు చేయడంతో వృద్దాప్యంలో వ్యవసాయం చేసే బలం లేకపోవడంతో వృద్దాప్యంలో రేషన్ బియ్యం మీద ఇరుగుపొరుగు వారి మీద ఆధారపడి బతుకుతున్న పరిస్థితి. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళ మల్లికా జనసైనికులు తుపాకుల ధరణి రాయల్ ఆకుల శంకర, కోటకొండ చంద్రశేఖర్, తక్కోళ్ల శివ, యాసిన్, సోను, కోనేటి శ్రీనివాసులు, షేక్ బహదూర్ జనసేన నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.