మార్పు కోరుకొంటున్న తెలుగు ప్రజానీకం: సురేష్ కరోతు

  • నిన్న తెలంగాణ తీర్పు, రేపు ఆంధ్రా తీర్పు ఒకేలా ఉండబోతుందా?

ఒకప్పుడు రాజకీయ పార్టీలు అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కేడర్ కాపాడుకొంటూ, కార్యవర్గానికి విలువనిస్తూ పరిపాలనలో ఎన్నికైన శాసనసభ్యుల పాత్ర కీలకంగా ఉండేది.

కుటుంబ పాలన: ప్రస్తుత జగన్ పరిపాలన రాచరికపు పోకడలు, ఏ మాత్రం తగ్గని తెలంగాణ దొరల పాలనలో కుటుంబ పాలన కొట్టివచ్చినట్టు కనబడింది. అన్నింటా తామే అయ్యి, ఎన్నికైన శాసన & లోక్ సభ సభ్యుల పాత్ర నామమాత్రం చేసేసారు. అందుకే వై.సి.పి పాలనలో అన్నింటా జగన్ మాత్రమే కనబడతాడు. తన కుటుంబ సబ్యులు, సన్నిహిత మిత్రులు రాష్ఠాన్ని దోచుకోవడంలో పూర్తిగా నిమగ్నమయ్యారు.

అప్పుచేసి పప్పు కూడు: రాష్ట అభివృద్ది కోసం అప్పు చేయడం తప్పు కాదు. కాని దాన్ని సంక్షేమ పేరిట (అది కూడా కొందరికి మాత్రమే) ఖర్చు చేసి, మళ్ళి అప్పుచేసి అప్పులాంద్ర ఆయ్యింది గాని అభివృద్ది గుండు సున్నా. అప్పు చేసి అభివృద్ది చేయ్యాలి. అభివృద్ది ఫలాలతో సంక్షేమం చూడాలి.
అప్పు <—> అభివృద్ది <—> సంక్షేమం — సమపాళ్ళలో ఉండాలి.

అప్పు: ప్రస్తుత అప్పు 6.38 లక్షల కోట్లు(6,38,217.85).
ఆదాయం: 1.91 లక్షల కోట్లు
ఖర్చులు: 2.40 లక్షల కోట్లు
బడ్జెట్ బేలన్స్: -48.724 కోట్లు (నెగెటివ్ 48వేల కోట్లు)
సుమారు 33% ప్రభుత్వ అప్పు ఉందంటే ఆలోచించండి ఒక్కసారి?
ఇలా అయితే మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? – కడుపు చేతపట్టుకొని వలసలు పోవలసిందేనా? ఉచితాలు ఏమైనా జగన్ తన జేబులోచి తీసి ఇస్తున్నాడా?
అది ప్రజల సొమ్ము, మరి బడాయి ఏంటి?

అభివృద్ది: గడిచిన ఐదు ఏళ్ళలో ….
ఒక ఐ.టి కంపెనీ అయినా వచ్చిందా?
ఒక డ్యాం అయినా కట్టగలిగేరా??
ఒక ఇంఫ్రాస్ట్రక్చర్ అయినా డెవలప్ చెయ్యగలిగారా?
గవర్నమెంట్ జాబ్స్ అయినా విడుదల చెయ్యగలిగారా?
మనమేం అభివృద్ది సాధించాం?
రోడ్లేమో గతుకులు,
నిరుద్యోగ యువతేమో ఇంట్లో,
జీతాలు అందక ఉద్యోగులు కష్టాలు,
పంటలు పండక రైతన్నల కన్నీళ్ళు,
మరి నువ్వో?
లక్షల కోట్ల ఇసుక తింటున్న ఇసుకాసురుడివి
వేల కోట్లు కల్తీ మద్యం ద్వారా పోగేసుకొన్న సారాసురుడివి
కనబడ్డ ప్రతీ భూమిని ఆక్రమించుకొన్న భూమాసురుడివి
భూమిలో ఖనిజాలు దోచుకొంటున్న నక్కాసురుడివి

ఇప్పటికి నీ దీమా చూస్తుండే నీ ప్రైవేట్ సైన్యంతో మరో రజ్వీ లాగ మమ్మలని భయపెట్టి, బెదిరించి అదీ కాకపోతే మమ్మలని బలితీసుకొవడానికి కూడా నువ్వెప్పుడూ సిద్దమే. వైసిపి విమోచన ఆంధ్ర రావడానికి త్రిమూర్తులు [మోది (బ్రహ్మ), చంద్రబాబు (విష్ణువు), పవన్ కళ్యాణ్ (మహేశ్వరుడు)] కలిసి జగనాసురుడి గద్దె దింపడానికి ఎన్నికల రణరంగంలో యుద్దం చేయడానికొస్తున్నారని ఉత్తర అమెరికా జనసేన నాయకులు సురేష్ కరోతు అన్నారు.