కల్వర్టులను ప్రారంభించిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

  • జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు సొంతనిధులతో నిర్మించిన కల్వర్టులను ప్రారంభించిన పిఠాపురం జనసేన ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్.

పిఠాపురం నియోజవర్గం: దుర్గాడ గ్రామంలో హరిజనకాలనీ నందు గల డ్రైనేజీలపై కల్వర్టులు లేని కారణంగా హరిజనకాలనీ ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్న తరుణంలో హరిజనకాలనీ ప్రజలు విన్నవించి‌, డ్రైనేజీలపై కల్వర్టులు నిర్మాణం చేయమని జనసేననాయకులు జ్యోతుల శ్రీనివాసును కొరగా వెంటనే స్పందించిన జ్యోతుల శ్రీనివాసు తన సొంతనిధులను 50 వేల రూపాయలు ఖర్చుపెట్టి రెండు కల్వర్టులను నిర్మించడం జరిగింది. నిర్మించిన కల్వర్టులను గురువారం మధ్యాహ్నంసమయంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి రెండు కల్వర్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురం జనసేన ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనపార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల కోరిక మేరకు ప్రజాసేవ కోసం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు తన సొంత నిధులతో ప్రజాసౌకర్యార్ధం హరిజనకాలనీలో కల్వర్టులు నిర్మాణం చేయడం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. ఈ సందర్భంగా తంగేళ్ల ఉదయ శ్రీనివాసు పంచాయతీ నిధులను వైయస్సార్ ప్రభుత్వం వాడేసుకున్న కారణంగా పంచాయతీ నందు చిన్న, చిన్న పనులను కూడా చేపట్టలేని దుస్థితిలోకి పంచాయతీలను తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా అక్కడున్న ప్రజలకు తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం జ్యోతుల శ్రీనివాసు, తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, పిల్లా శ్రీధర్ లను హరిజనకాలనీ ప్రజలు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ప్రజాహిత కార్యక్రమాలను తాను సాయిప్రియ సేవాసమితి ద్వారా గత 15 సంవత్సరాల నుంచి చేపట్టడం జరిగిందని, దుర్గాడ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, మేం చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరూ రక్షణగా ఉండి నేను చేసే కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవలసిందిగా అక్కడ ఉన్నా ప్రజలను ఉద్దేశించి జ్యోతుల శ్రీనివాసు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్, జనసేన ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్లం వాసు, పిల్లా శివశంఖర్, మాదేపల్లి శ్రీనివాసు, సారిపల్లి నాగేశ్వరరావు, నక్కా బద్రీ, బవిరిశెట్టి రాంబాబు, పినాక వెంకట్రావు, ఇంటి వీరబాబు, మొగిలిశ్రీను, మేడిబోయిన సత్యనారాయణ,
గొల్లపల్లి గంగ, సకినాల రాంబాబు, గొల్లపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.