మహా శాంతియుత ధర్నాకు సహకరించినందుకు ధన్యవాదములు: శివదత్ బోడపాటి

మహా శాంతియుత ధర్నా 142 వ రోజుకు చేరుకుంది, ఈ దర్నా లో భాగంగా హెటిరో కంపెనీ వారు ఇప్పటికే 70% పైప్ లైన్లు తొలగించారు. మిగిలిన 30% పైప్ లైన్లు తొలగించాలని పోలీస్ అధికారులతో మరియు కంపెనీ యాజమాన్యంతో చర్చించడం జరిగింది, దీనిపై వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ సోమవారం మిగిలిన ముక్కలను కూడా అందరి సమక్షంలో తీసివేస్తాము అని చెప్పినందుకు పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి హృదయపూర్వక ధన్యవాదములు తెలియ జేశారు.