వైసీపీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి చాలా దీనంగా తయారయింది: బత్తుల

  • రైతు సంక్షేమం ఏది..??
  • మద్దతు ధర పెంచాలి
  • ధాన్యం తరలింపుకు వారికి కావలసిన గోనెసంచులు వెంటనే అందుబాటులో ఉంచాలి, మరిన్ని రోజులు ధాన్యం కొనుగోలు చేయాలి.

రాజానగరం: కోరుకొండ మండలం, కోరుకొండలో రైతు ప్రభుత్వంగా డప్పు కొట్టుకునే వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తూట్లు పొడుస్తుందని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ అన్నారు. కోరుకొండ, కాపవరం గ్రామ తదితర చుట్టుప్రక్కల గ్రామాల్లోని రైతులతో స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వద్దకు రైతుల సమస్యలు వివరించడానికి బత్తుల బలరామకృష్ణ వచ్చారు, రైతులు పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, ధాన్యం తరలింపు వారికి కావాల్సిన గోనెసంచులు నెల రోజుల నుంచి రైతు భరోసా కేంద్రాల వద్ద దొరకడం లేదని, గోనెసంచెలను తక్షణమే రైతు భరోసా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని, కనీసం మద్దతు ధర కల్పించి, రైతులు ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ అయ్యేలా చూడాలని, అలానే ఫిబ్రవరి 14తో ధాన్యం కొనుగోలు గడువు ముగుస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారని ఈ సమయాన్ని మరింత పెంచాలని, ఒక్కొక్క బస్తా మిల్లు వద్దకు తరలింపుకు సుమారు 200 రూపాయలు ఖర్చు అవుతుందని తెలుపుతూ.. ఇది రైతుల నుండి వసూలు చేయడం అత్యంత దురదృష్టకరమైన పేర్కొంటూ ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో నియోజకవర్గ స్థాయిలో భారీ ధర్నాకు దిగి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని హెచ్చరించారు.. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ రైతులు కావలసిన గోనె సంచులు రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తామని, ధాన్యం తరలింపుకు, రైతులు ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ అయ్యేలా చూసి, సహకరిస్తానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ బయట స్థానిక మీడియాతో బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ కనీస మద్దతు ధర అంశంలో అటు తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని ఇటు ఏపీ ప్రభుత్వం కనీసం మద్దతు ధర అంశంలో నోరు మెదపడం లేదని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల్ని వదులుకొని సొంత ప్రయోజనం కోసం వైసీపీ పాకులాడుతుందని దుయ్యబట్టారు.. దీంతో దిక్కు తోచని పరిస్థితిలో రైతులు కుదేలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తరలింపుకు కనీసం గోనె సంచులు కూడా ఏర్పాటు చేయలేని దీనస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉందని, ధాన్యం తరలింపుకు ఒక్కో బస్తాకు 200 రూపాయలు రైతుకు ఖర్చవడం అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి అని తెలుపుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు ఎన్ని ఎకరాల్లో పంట నష్టం సంభవించిందనే అంచనాలు కూడా జిల్లా యంత్రాంగం సిద్ధం చేయలేకపోయిందని దుయ్యబట్టారు. తక్షణం ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర పెంచేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర తదితర అంశాలపై రైతులకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేస్తూ ధాన్యం బకాయిలు సాధ్యమైనంత త్వరగా రైతులకు అందే విధంగా చర్యలు చేపట్టాలని. ప్రభుత్వ పెద్దలు మిల్లర్లకు తలొగ్గి రైతాంగం తలదించుకునేలా చేస్తున్నారని, అధికారులు, మిల్లర్లు దందాలో ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం రైతులకు నమ్మకద్రోహం చేసినట్టు కాదా అని తీవ్రస్థాయిలో వైసీపీ సర్కారుపై బత్తుల బలరామకృష్ణ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం నుంచి రైతులు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు..

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2023-02-07-at-4.04.42-PM-1024x580.jpeg