అనంతగిరి తాసిల్దార్ రమాబాయ్ పై చిట్టం మురళి ఫైర్

  • ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకు నో ఎంట్రీ అంటున్న అనంతగిరి తాసిల్దార్ రమాబాయ్
  • అనంతగిరి మండల జనసేన అధ్యక్షులు చిట్టం మురళి

అనంతగిరి మండలం: ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకు అనంతగిరి తాసిల్దార్ రమాబాయ్ నో ఎంట్రీ అంటున్నారని అనంతగిరి మండల జనసేన అధ్యక్షులు చిట్టం మురళి దుయ్యబట్టారు. ఈ సందర్భంగా చిట్టం మురళి విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక రెవిన్యూ కార్యాలయంలో ప్రజాసమస్యలపై నిత్యం వివిధ పార్టీలు కి చెందిన నేతలు తరచు వెళ్తుంటారు కానీ ప్రజాసమస్యలపై పోరాడే నాయకులు వెళ్ళినప్పుడు తాసీల్ధార్ రమాబాయ్ గారి ప్రవర్తన హుందాగా లేదని ప్రజలు అంటున్నారు కేవలం సెటిల్ మెంట్స్, భూ దందాలు చేసే నాయకులకు మాత్రమే ప్రవేశమన్నట్లు మిగతా వాళ్ళకి నో ఎంట్రీ అంటూ ముఖం మీదే చెప్పడం అనంతగిరి తాసీల్ధార్ కె చెల్లిందని చెప్పాలి. ఇటీవలే జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి ఒక పని మీద ఎమ్మార్వో అఫిస్ కి వెళ్తే మీకు ఎంట్రీ లేదని అనడం కాస్త విస్మయని గురిచేసింది. భూ దందాలు ఆక్రమణలు అనంతగిరి మండలంలో ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ విషయంలో తాసీల్ధార్ పాత్ర లేకపోతే అక్రమార్కులు ఎందుకు రెచ్చిపోతారు?. మాముళ్ళకి అలవాటు పడ్డారని మండలంలో ప్రజలందరూ గుస గుసలాడుతున్నారు. ఎమ్మార్వో గారి ప్రవర్తన చూసి విసుగు చెందిన చిట్టం మురళి పై అధికారులకు తెలియజేయగా దొంగ ఏడ్పులతో సెంటిమెంట్ తో ప్రజలను మభ్యపెట్టడం చూస్తే ఇటువంటి అధికారిణితో అనంతగిరి మండలం అస్తవ్యస్తమే కానీ సామాన్యులకు న్యాయం జరిగే అవకాశాలు లేవని చిట్టం మురళి అన్నారు.