సర్వేపల్లి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తం

రాజంపేట: ముత్తుకూరు మండలంలో పలు ప్రాంతాలలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లన్నింటిని ఆదివారం జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ మోతుకూరు నుండి మామిడిపూడికి వెళ్లే రోడ్డు, జెన్కో కు వెళ్లే రోడ్డు అలా చెప్పుకుంటూపోతే అనేక గ్రామాలలో రోడ్లు అన్ని అస్తవ్యస్తంగా వున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు కానీ అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లపై ఏర్పడిన గుంటలను పూడ్చాలన్న ఆలోచన లేకపోవడం చాలా సిగ్గుచేటుగా వుంది. వాహన చోదకులు, ప్రయాణికులు అస్తవ్యస్తంగా ఉన్న ఈ రోడ్లపై ప్రయాణం చేయాలంటే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్లపై ఉన్న గుంటలో పడి ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి. ఇకనైనా కళ్ళు తెరిచి గుంటలను పుడ్చండి. మీరు మరమ్మతులు చేయకపోతే 2024లో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రజా ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నిటినీ కూడా పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అశోక్, సుమన్ , వెంకటేష్, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి, మండల నాయకులు ఖాజా, వంశీ తదితరులు పాల్గొన్నారు.