ఉద్యోగాలకు ఇకనుండి దేశమంతా ఒకటే ఎంట్రన్స్ టెస్ట్: కేంద్రం

ప్రభుత్వోద్యోగాల భర్తీకి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కేంద్ర ప్రబుత్వ ఉద్యోగాలకు ఇకపై దేశమంతా ఒకటే ఎంట్రన్స్ పరీక్ష అదే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. దీనికోసం జాతీయ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటు. ప్రభుత్వోద్యోగాల భర్తీకి ఇదే ఇకపై విధానం. కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం పలికింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ  ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది బడ్జెట్ లో ఎన్ఆర్ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ కీలక నిర్ణయం దేశంలో నిరుద్యోగ యువతకు తోడ్పాటు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకుల్లో ఖాళీల భర్తీకు ఎన్ ఆర్ ఏ ఒకే ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మెరిట్ లిస్ట్ కు మూడేళ్ల వరకూ వ్యాలిడిటీ ఉంటుంది.  ఈ మూడేళ్ల వ్యవధిలో అభ్యర్ధి విభిన్న సంస్థల్లో తనకు నచ్చిన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ రిక్రుట్ మెంట్ ఏజెన్సీనే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తుంది.