ట్రాన్స్ ఫార్మర్ సురక్షితమైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలని పితాని డిమాండ్

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం తీరప్రాంత మత్స్యకార గ్రామమైన బలుసుతిప్పలో ప్రమాదకరంగా చేతికి అందేటంత ఎత్తులో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడంతో ఈ ట్రాన్స్ ఫార్మర్ నివాస ప్రాంతంలో ఉండటం వలన పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని ట్రాన్స్ ఫార్మర్ ను సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని గ్రామస్థులు పలుమార్లు కోరినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో జనసేన పార్టీ రాష్ట్ర పి.ఏ.సి సభ్యులు, ముమ్మిడివరం ఇన్ ఛార్జ్ పితాని బాలకృష్ణ బలుసుతిప్ప గ్రామం వెళ్లి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. ట్రాన్స్ ఫార్మర్ మార్చి సురక్షితమైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులను, విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేసారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు సాధ్యమైనంత తొందరలో సమస్యను పరిష్కరించి సానుకూలంగా స్పందించకపొతే దీనిపై కార్యాచరణ చేపడతామని పితాని విద్యుత్ శాఖ అధికారులకు మీడియా ద్వారా తెలియజేసారు.