ప్రభుత్వ జూనియర్ కళాశాలను కో ఎడ్యుకేషన్ కళాశాలగానే కొనసాగించాలి

*ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కో ఎడ్యుకేషన్ కళాశాలగా కొనసాగించాలని పి.డి.ఎస్.యూ, టి.ఎన్.ఎస్.ఎఫ్ ల జనసేన పార్టీ డి.హెచ్.పి.ఎస్ డిమాండ్

*మడకశిర ఎమ్మెల్యే కి వినతిపత్రాన్ని అందించిన ఐక్యవిద్యార్థి సంఘాలు మరియు ప్రజా సంఘాల నాయకులు

సత్యసాయి జిల్లా, మడకశిర మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలను కో ఎడ్యుకేషన్ కళాశాలగానే కొనసాగించాలని ఐక్య విద్యార్థి మరియు ప్రజా సంఘాలు పి.డి.ఎస్.యూ, టి.ఎన్.ఎస్.ఎఫ్, ఏ.ఐ.ఎస్.ఎఫ్, జనసేన పార్టీ, డి.హెచ్.పి.ఎస్ ఆధ్వర్యంలో కోరడం జరిగింది. కొత్తగా శాంక్షన్ అయినటువంటి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను అదనంగా ఏర్పాటు చేయాలని కోరుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మారుమూల ప్రాంతాల నుంచి రొల్ల, అగలి, అమరాపురం, గుడిబండ రొద్దం ,కళ్యాణదుర్గం దూరపు ప్రాంతాల నుంచి ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకోవడానికి విద్యార్థిని విద్యార్థులు వస్తున్నారు ఈ కళాశాలలో మొదటి సంవత్సరం దాదాపుగా 293 మంది ద్వితీయ సంవత్సరం249మంది మొత్తం దాదాపుగా542 మంది విద్యార్థులకు ఈ కళాశాలలో చదువుకుంటున్నారు కావున ఈ కళాశాలలో ఎంతోమంది ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకు ఎదిగినటువంటి కళాశాల ఈ కళాశాలను కో ఎడ్యుకేషన్ కళాశాలగ కొనసాగించాలని ఐక్య విద్యార్థి మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము కొత్తగా శాంక్షన్ అయినటువంటి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను అదనంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము ప్రభుత్వ జూనియర్ కళాశాలను కో ఎడ్యుకేషన్ తీసివేయడం వల్ల వందలాది మంది విద్యార్థులు అనేక రకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కావున ప్రభుత్వ జూనియర్ కళాశాలను యధావిధిగా కొనసాగించే విధంగా చూడాలని మడకశిర శాసనసభ్యులు డాక్టర్ ఎం తిప్పేస్వామి కి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. దీనిపై స్పందించినటువంటి మడకశిర శాసనసభ్యులు డాక్టర్ తిప్పే స్వామి విద్యాశాఖ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ, జిల్లా ఉపాధ్యక్షులు ఉమేష్ నాయక్ జనసేన పార్టీమండల అధ్యక్షులు టి. ఎ శివాజీ టి.ఎన్.ఎస్.ఎఫ్ తాలూకా అధ్యక్షులు జవనకుడు రంగస్వామి జిల్లా ఉపాధ్యక్షులు మురళీ బాబు డి.హెచ్.పి.ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.