చేనేత పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది: దారం అనిత

మదనపల్లె, వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి చూపుతున్న చేనేత పరిశ్రమ మనుగడ దినదినగండంగా మారింది. నేతన్న నేస్తం పథకం వచ్చిన తర్వాత అంతకుముందు ప్రవేశపెట్టిన ప్రోత్సాహకాలను నిలిపివేయడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్లు కరోనాతో ఉపాధి లేదు. వస్ర్త నిల్వలు పేరుకుపోయాయి. ఇప్పుడు ముడిసరుకుల ధరలు వ్యత్యాసంతో చేతినిండా పనులు ఉండటం లేదు. అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా మదనపల్లె పరిధిలోని నీరు గుట్టు వారి పల్లిలో చేనేత కార్మికుల సంఖ్య ఎక్కువ ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 20 వేల మంది కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తంబాలపల్లి, కురబలకోట, నిర్మన పల్లె, కలికిరి ,వాయల్పాడు, పీలేరు గుర్రంకొండ, వాల్మీకిపురం, కొత్తకోట, ఏటీఎం, రాజంపేట కోడూరు, పుల్లంపేట, వీరబల్లి తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఎక్కువ ఆయా ప్రాంతాల్లో తయారైన చీరలను తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. కాటన్ వస్త్రాలు ఎక్కువగా తయారవుతాయి గతంలో 20 శాతం వీటికి రాయితీ ఉండేది కొన్నేళ్లుగా రాయితీ నిలిపివేశారు. దీనికితోడు జీఎస్టీ అదనపు భారంగా మారుతోందని చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంత మగ్గంలో ఒక చీర వేసేందుకు రెండు రోజులు పడుతుంది. డిజైన్ లను బట్టి 800 నుండి 1600 వరకు కూలి ఇస్తారు. కరెంట్ మగ్గడంలో అయితే ఒక రోజులో రెండు చీరలు నేయవచ్చు. 500 నుండి 700 కూలి చేతికందుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం చుట్టారు.
ఉమ్మడి జిల్లాలో 2019-20… 11,774 మందికి 2,82,576 లక్షలు. 2020-21లో 9,311 మందికి 11 మందికి 2,23,464 లక్షలు. 2021-22లో 8,993 మందికి 215.83 లక్షలు లబ్ధిదారులకు అందజేశారు. అర్హులు చాలా మంది ఉన్నా నేతన్న నేస్తం కింద 24000 అందటం లేదని బాధితులు వాపోతున్నారు. మూడేళ్ల కిందట పడుగు (1,250 గ్రాములు) 3000 ఉండేది ప్రస్తుతం 6000 పైగా ఉంది దీనివల్ల చీరలు ధరలు అమాంతంగా పెరిగిపోయాయి అని చేనేత కార్మికుల బతుకులు బజారున పడ్డాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాలతో ఎదురీదుతున్న చేనేత కార్మికులను ప్రభుత్వం వెంటనే ప్రోత్సహించాలి. ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నానని చిత్తూరు జిల్లా జనసేన కార్యదర్శి దారం అనిత అన్నారు.