దళిత వాడలో రేప రేప లాడిన జనసేన జెండా

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో సత్కరించిన బత్తుల
  • బత్తుల చేపట్టిన పాదయాత్రకు బ్రహ్మరధం పడుతున్న ప్రజానీకం

రాజానగరం: కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో 5వ రోజు జనం కోసం జనసేన మహాపాదయాత్రకు భారీ స్పందన వచ్చింది. పాదయాత్రలో నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మితో పాటు వారి కుమార్తె వందనాంబిక పాదయాత్రలో పాల్గొని గ్రామంలో ప్రతీ ఇంటికీ వెళ్ళి ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి ప్రజా పరిపాలన తెచ్చుకుందాం అని తెలియజేస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గాడాల గ్రామ జనసేన నాయకులు, జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.