కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించిన జనసైనికులు

ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం, పెండ్యాల గ్రామంలో జి. నర్సింహారావు 22ఎకరాల భూములను కౌలుకు తీసుకొని సాగుచేస్తూ.. తెలిసిన వాళ్లందరి దగ్గర అప్పులు చేసి, పంటలు నష్టం రావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నర్సింహారావు కుటుంబసభ్యులను మండల నాయకులు షేక్ పెద్దబాజీ, వెంకట సూర్య తేజ పరామర్శించి మీ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా నాయకులకు దగ్గరికి తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తామని అని జనసైనికులు హామీ ఇచ్చారు.