దసరా మహోత్సవాలలో అన్నసమారాధనలో పాల్గొన్న కాళ్ళ జనసేన నాయకులు

ఉండి నియోజకవర్గం, కాళ్ళ మండలం కాళ్ళ గ్రామంలో పాండు రంగ స్వామి వారి గుడి వద్ద వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దసరా మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన అఖండ అన్నసమారాధన కార్యక్రమంలో జనసేనపార్టీ ఉండి నియోజకవర్గ నాయకులు జుత్తుగ నాగరాజు పాల్గొని అమ్మవారిని దర్శించి అనంతరం జరిగిన ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, జనసేనపార్టీ నాయకులు, నాగరాజు, మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, పాలకోడేరు మండల అధ్యక్షులు గాధం నానాజీ, మండల కమిటీ సభ్యులను సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాళ్ళ మండల జనసేన నాయకులు కాళ్ళ మండల ఉపాధ్యక్షులు ఓగిరాల రాజేష్, గడి రాము, ప్రధాన కార్యదర్శులు చవాకులు నాని, ఆరేటి దిలీప్, నిమ్మకాయల సాయి కుమార్, కొప్పర్తి ఆదిత్య, ఆలయ కమిటీ పెద్దలు బండారు నాయుడు, బండారు సోమేశ్వర రావు, నూకల భోగీంద్ర, కొమ్మన రాంబాబు, గనిశెట్టి సత్యనారాయణ, నారిన శ్రీను, గనిశెట్టి సురేష్, కొటికలపూడి శివకృష్ణ, నిమ్మల నాగు, ముత్యాల వీరనాగేశ్వర రావు, గనిశెట్టి ప్రసాద్, జక్కంశెట్టి ప్రసాద్, జనసేన నాయకులు, సైనికులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించటం జరిగింది.