విశాఖ పరిశ్రమ కాదు ఆంధ్రుల ఆత్మ గౌరవం:బండి రామకృష్ణ

మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయం నందు ఇంచార్జి బండి రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల అందరికీ తెలిసేలా సోషల్ మీడియా క్యాంపెయిన్ లో భాగంగా ప్లకార్డులు తో నిరసన తెలియజేస్తూ వారి యొక్క ట్విటర్ ఖాతాలకు ట్యాగ్ చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది.

ఇంచార్జ్ బండి రామకృష్ణ గారు మాట్లాడుతూ విశాఖ ఓపెన్ కేవలం ఒక పరిశ్రమగా కాకుండా ఆంధ్రుల ఆత్మ గౌరవం గా గుర్తించాలని దాని ప్రైవేటీకరణ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత మన రాష్ట్ర ఎంపీలకు అందని కానీ మన రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు ఎవరు గళం ఎత్తకపోవడం చాలా బాధాకరమైన అన్నారు ప్రజలు కూడా తెలంగాణ ప్రజల యొక్క స్పూర్తిని మనలో నింపుకొని వారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన విధంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క విశాఖ ఉక్కు కొరకు ప్రతి ఒక్కరు స్పందించి పోరాట స్ఫూర్తిని చూపించాలని కేవలం రాజకీయ పార్టీల కే కాక ప్రజల కూడా దీనిలో భాగస్వామ్యం పొందాలని ఏనాడైతే ప్రజలు దీనిలో భాగస్వామ్యం అవుతారు రైతు వ్యతిరేక చట్టాలను వెనక తీసుకున్నట్లే ప్రభుత్వాల దిగివచ్చి మనకు న్యాయం చేస్తాయని తెలియజేశారు

జిల్లా ఉపాధ్యక్షులు పంపు గడవల చౌదరి గారు మాట్లాడుతూ రాష్ట్ర ఎంపీలు ఇప్పటికైనా కళ్లు తెరిచి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని ఉన్న పార్లమెంట్ సమావేశాల్లో వారి యొక్క గళాన్ని ఇవ్వాలని కోరారు రాష్ట్ర ఎంపీలు మౌనంగా కూర్చుంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టు అని తెలిపారు

మైనార్టీ నాయకులు భాషి మాట్లాడుతూ ఎంపీలు ఇప్పటికైనా నిద్ర లేచి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు పై గళం విప్పాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకోవాలని కోరారు .

ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఇంచార్జి బండి రామకృష్ణ , జిల్లా ఉపాధ్యక్షులు చౌదరి , జిల్లా కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ , పట్టణ ఉపాధ్యక్షుడు ఎండి సమీర్, కర్రి మహేష్, మణి బాబు వాసు కొండా మేస్త్రి చలమలశెట్టి రమేష్, ఎండి భాషి,నాగరాజు,మోకా రవి,ఆడుసుమిల్లి శ్రీనివాస్,రాంగ్ జ్యోతి యశ్వంత్ చక్రి వీర మహిళలు గంపల దుర్గ భవాని, ఉషారాణి కుమారి నాగమణి మరియు ఇతర జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.