ఎస్. కె. ఆర్ నగర్ లో ఇంటింటికి జనసేన

*ఇంటింటి ప్రచారం చేసిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

సిద్ధవటం: రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు.. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో.. ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా 11వ రోజు సిద్ధవటం మండలంలోని మాధవరం -1 గ్రామపంచాయతీలో ఉన్న ఎస్. కె. ఆర్ నగర్, బంగారుపేట గ్రామాలలో ఇంటింటి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని జనసేన సిద్ధాంతాలను రూపొందించిన కరపత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, చంగల్ రాయుడు, తాళ్లపాక శంకరయ్య జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.