వేడంగి గ్రామంలో ఘనంగా జనం చెంతకు జనసేన

పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు నియోజకవర్గం, పోడూరు మండలం వేడంగి గ్రామంలో జనం చెంతకు జనసేన కార్యక్రమాన్ని వేడంగి జనసైనికులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నారై నాయకులు కొప్పర్తి వెంకట నారాయణరావు ఆర్థిక సహాయంతో వేడంగి స్మశాన వాటికలో ఏర్పాటు చేసిన విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. ఈ భవన నిర్మాణం పట్ల గ్రామంలోని ప్రతీ ఒక్కరూ హర్షం వ్యక్తం చేయడంతో ప్రజా సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపడంలో జనసేన మరియు జనసైనికులు ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. అనంతరం పాలకొల్లు నియోజకవర్గ మరియు వేడంగి గ్రామ జనసైనికులు గ్రామంలోని ప్రతీ ఇంటికి తిరిగి పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను గ్రామస్తులకి వివరించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గ జనసేన నాయకులు, వేడంగి జనసేన ఎంపీటీసీ యర్రంశెట్టి నర్సింహారావు, వేడంగి జనసేన పార్టీ అధ్యక్షుడు కొర్రకూటి హరి, బొలిశెట్టి నాగరమేష్, నల్లి వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి శ్రీనివాస్ మరియు పెద్ద ఎత్తున వేడంగి జనసైనికులు పాల్గొన్నారు.