దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ : నేడు హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్‌ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘ఈ పండుగ రకరకాల రంగులు కలబోసిన పండుగ మాత్రమే కాకుండా… సామాజిక సామరస్యాన్ని తెలిజేస్తుంది. ప్రజల జీవితాలలో ఆనందం, ఆశను కలిగిస్తుంది. అలాగే ఈ పండుగ మన సాంస్కృతిక వైవిధ్యానికి, సమగ్రమైన జాతీయవాద స్ఫూర్తిని మరింత పెంచతుంది’ అని రాష్ట్రపతి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్‌ గుండెనొప్పి రావడంతో గత శనివారం మధ్యాహ్నం ఎయిమ్స్‌ ఆసుప్రతిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చికిత్స పొంతున్నారు.