నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రధాని పర్యటన

న్యూఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్రమోడి తమిళనాడు, పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. త్వరలో జరుగనున్న రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు పునాది రాయి వేయనున్నారు. ఉదయం 11.30గంటలకు పుదుచ్చేరిలోని కరైకల్‌ జిల్లా పరిధిలోని విల్లుపురం నుంచి నాగపట్నం వెళ్లే 56 కిలోమీటర్ల నాలుగులైన్ల జాతీయ రహదారికి శంకుస్థాపన చేస్తారని పీఎంఓ తెలిపింది. ప్రాజెక్టుకు రూ.2,426 కోట్లు కేంద్రం కేటాయించింది. న్యూ క్యాంపస్‌ఫేజ్‌ 1, కరైకల్‌ జిల్లా (జిప్‌మర్‌), వద్ద మెడికల్‌ కాలేజీ భవనానికి పునాది రాయి వేస్తారని, పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (జిప్‌మర్‌)లో బ్లడ్‌బ్యాంక్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.