కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న బ్రిటన్‌ ప్రధాని

లండన్‌: బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ శుక్రవారం ఆస్ట్రాజెన్‌కా కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నారు. కరోనాకు చికిత్స పొందిన డౌనింగ్‌ స్ట్రీట్‌ నివాసానికి సమీపంలో ఉన్న సెంట్రల్‌ లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలోనే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌తో ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని, సురక్షితంగా ఉందని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ప్రజలను కోరారు. ఇది మీకు, మీ కుటుంబానికి ప్రతి ఒక్కరికీ అవసరమని అన్నారు. ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని యూరప్‌ శాస్త్రవేత్తలు కూడా పేర్కొన్నారని పునరుద్ఘాటించారు.