నిజాయితీగా ఓటు హక్కును వినియోగించాలి: గర్భాన సత్తిబాబు

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గ జనసేన నాయుకులు గర్భాన సత్తిబాబు ఆంధ్రప్రదేశ్ లో వైస్సార్సీపీ గవర్నమెంట్ ప్రజలను ఎలా మోసం చేస్తుంది అని వివరించారు.
1) ఇసుక కొరత మరియూ కార్మికుల ఆకలి కేకలు.
2) రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువత కి మొండి చెయ్యి.
3) సిపిఎస్ రద్దు చేయలేము, ప్రత్యేక హోదా మేము తేలేము.
4) రోడ్ల అద్వాన పరిస్థితి, పోలవరం మొండి చేయి.
5) మద్యపాన నిషేదం పై మడమ తిప్పడం, పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకి మొండి చేయి.
6) దిశా చట్టం పేరుకి మాత్రమే పరిమితం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపడం.
ఇవన్నీ మీరు మరచిపోతే.. రాష్ట్రం 2024 తరవాత దేశ చిత్రపటం నుండి మాయమవుతుందని వైఎస్సార్సీపీ నాయకుల ఖజానాలోకి వెలిపోతుందని, కనుక గుర్తుంచుకోండి సగటు సామాన్యులారా మేధావులారా… మీ ఓటు అమూల్యమైనది.. 1000, 2000 రూపాయలకి.. అమ్ముకోకండి. మీ జీవితం, మీ కుటుంబం, మీ భావితరాల కోసం సరైన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి నిజాయితీగా ఓటు వెయ్యండి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండల నాయుకులు జనసేన జానీ, వండానా సాయికిరణ్, సతివాడ వెంకటరమణ, హరీష్ పాల్గొన్నారు.