తెలంగాణలో మనం సాధించుకున్న హక్కులు, కోల్పోయిన ఫలాలు

హుస్నాబాద్, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్భాటంగా రైతు దినోత్సవాలు చేసుకున్న సందర్భంగా తెలంగాణలో మనం సాధించుకున్న హక్కులు, కోల్పోయిన ఫలాలు, అదే జనసేన పార్టీ అధికారంలో వుంటే రైతుకు అండగా ఉండే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా ముఖంగా తెలిపారు. సాధించుకున్న హక్కులను తెలుపుతూ

  1. రైతుకు రైతు బంధు ఇవ్వడం.
  2. రైతుకు ఉచితంగా (సంవత్సరానికి 320/-) కరెంట్.
  3. రైతు కష్టంతో ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షలు ఇప్పించుకుంటున్నం(అందరికీ అందడం లేదు అది నిజం).
  4. పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. (దళారుల చేతికి వెళ్ళిపోయింది).
  5. 25, 30 సంవత్సరాల క్రితం భూములు అప్పటి రేటుకు అమ్మి, ఇప్పుడు అప్పుడు నేను పెట్టలేదు సంతకం అని చెప్పి కొన్న వాని దగ్గర మరలా దోసుకొనే వెసులుబాటు దొరికింది.
    ఇక రైతుకు జరిగిన నష్టాలు:
  6. రైతు బంధుకు ముందు మన ఖర్చు పంట పండించటానికి అయ్యే ఖర్చు 15000 అదే దళిత బంధు ఇచ్చినాక ఈ పది సంవత్సరాలలో 3 ఇంతలు అయ్యింది.
  7. తెలంగాణలో రైతును మోసం చేస్తున్న ప్రభుత్వం దళిత బంధు ఇస్తున్నాం అని చెప్పి రైతుకు వచ్చే సబ్సిడీలు అన్ని ఎత్తేశారు.
  8. పాలకవర్గం రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వమే పూర్తిగా కొంటుంది అని చెప్పి ముందు ఐకేపీ సెంటర్ దగ్గరికి ఆ తరువాత మిల్లుకు తీసుకుపోయే కష్టాన్ని పెంచుతూ అదే రైతు దగ్గర కనిష్టంగా270/- నుండి గరిష్టంగా 610/- వరకు దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం మరియు మంత్రులు ఆధారాలతో చూపిస్తా.. మిల్లర్లకు దొచిపెడుతూ అక్కడ నుండి కల్వకుంట్ల కుటుంబానికి % వాటా.. రైతును మోసం చేసిన ప్రభుత్వం.
  9. ధరణి పేరు చెప్పి మీ ఆస్తుల మూలాలు లేకుండా రేపటి తరం గట్టు కాడ కొట్లాటలు పెట్టుకొనే విధంగా చేసింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వం. ప్రజలందరినీ మోసం చేసిన ప్రభుత్వం.
  10. రైతు కూలీలకు చాతకాని వాళ్ళను చేసి అదే రైతుకు రైతు కూలీలను దూరం చేసిన ఘనత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదం. రైతును, రైతు కూలీలను మోసం చేసింది ప్రభుత్వం.
  11. ప్రాజెక్ట్ లకు, కంపెనీలకు భూములు ఇవ్వడానికి రైతులు 2 పంటలు పండించే భూములను కారు చౌకగా తీసుకొని వారికి భద్రత కల్పిస్తాం అని మాట చెప్పి రోడ్డు మీద వదిలేసి రైతును మోసం చేసింది ప్రభుత్వం. రైతుకు రావలసిన పరిహారం ఇవ్వకుండా పోలీస్ వ్యవస్థను పహారాగా పెట్టి మరీ ఇండ్లను కూల్చింది ఈ ప్రభుత్వం. 7. పసుపు, మిర్చి పండించిన రైతులను రోడ్డు మీద బూటు కాళ్ళతో తన్ని రైతు విలువను దిగజార్చడం చేసింది ఈ ప్రభుత్వం. రైతును మోసం చేసిన ప్రభుత్వం
  12. పల్లెను ప్రగతి పథాన నడిపిస్తున్నము అని చెప్పి రాజకీయ కుంపట్లు పెట్టీ తన్నుకు చచ్చేలా చేసింది ఈ ప్రభుత్వం ఈ పది సంవత్సరాలలో కల్మషం లేని రైతు మెదడును మలినం చేసింది ఈ ప్రభుత్వం. రైతును ఇంత ఇబ్బంది పెట్టిన కోపం చూపకుండా అతను చేస్తున్న సాయం మనకోసం వ్యవసాయం. ఈ సమస్యలకు సమాధానం చెప్పి రైతు దినోత్సవం మళ్ళీ ఘనంగా ఆ రైతులను కలుపుకొని సంబరాలు చెయ్యాలి కాని ఒక బి.ఆర్.ఎస్ శ్రేణులు కలిసి చేసిన దానిని రైతు ఉత్సవం ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నానని చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
    అదే జనసేన పార్టీకి అవకాశం ఇస్తే
  13. రైతుకు ఏకరానికి 8000)- రైతుకు అండగా నిలబడింది.
  14. ప్రతి గ్రామానికి గిడ్డంగులు, మండలానికి శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తుంది.
  15. 50 సంవత్సరాల వయస్సు వచ్చిన రైతుకు 5000 పెన్షన్ వచ్చే విధంగా సమాలోచనలు చేస్తుంది.
  16. రైతు పండించిన పంటలను విదేశాలకు అమ్ముకొనే వెసులుబాటు ఏ దళారీ, దళారీ వ్యవస్థ లేకుండా చేస్తుంది.
  17. రైతుకు ఆరోగ్యం బాగాలేక ఆస్తులు అమ్ముకొని ఆరోగ్యం బాగుచేసుకొని అప్పుల పాలు కాకుండా ప్రతి ఒక్కరికీ 20లక్షల ఇన్సూరెన్స్ వర్తింపబడేలా ఇన్సూరెన్స్ చేయించుకొని సరైన జీవనం సాగేలా చేస్తుంది. చట్ట సవరణలు ప్రజల మేలు కోసం చేసి వాటి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేర్చడం జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశ్యమని చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.