సామాజిక సేవలో జనసైనికుల సేవలు స్ఫూర్తి దాయకం.. మాకినీడి శేషుకుమారి

పిఠాపురం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలనే ఆశయంతో దేశభక్తి త్యాగనిరతికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన దేశభక్తుడు స్వతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ స్ఫూర్తిదాయకంగా జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు నిలుస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మాకినీడి శేషు కుమారి పేర్కొన్నారు. సోమవారం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు జ్యోతుల శ్రీనివాసు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన భగత్ సింగ్ రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేషు కుమారి మాట్లాడుతూ.. జనసేన పార్టీ అంటేనే సేవకు నిర్వచనం అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో మేమున్నాము అని భరోసా ఇచ్చే జనసైనికులను కలిగి ఉండడం జనసేన పార్టీకి మాత్రమే దక్కిందన్నారు. దీనిలో భాగంగానే జ్యోతుల శ్రీనివాసు జన్మదినాన్ని పురష్కరించుకుని, ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ముఖ్యంగా వేసవికాలంలో రక్తం ఎద్దడి చాలా ఎక్కువగా ఉందని, ఆపదలో ఉన్నవారికి రక్తం అందించలేక బ్లడ్ బ్యాంకులు ఇబ్బందుపడుతున్న వైనాలు ఇటీవల చూస్తున్నామని, ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రమాదాల భారిన పడి రక్తం కోసం ఎదురుచూస్తున్న వారికి జ్యోతుల శ్రీనివాసు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ రక్తదానం శిబిరంలో సేకరించిన రక్తం ఎందరో ప్రాణాలను నిలుపుతుందని కొనియాడారు. సమయానుకూలంగా అత్యవసర సమయంలో స్పందించడం కేవలం ఒక్క జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, గొల్లప్రోలు పట్టణ ప్రెసిడెంట్ వినుకొండ శిరీష, గొల్లప్రోలు మండల మహిళా ప్రెసిడెంట్ వినుకొండ అమ్మాజీ, నాయకులు జనసైనికులు, వీరమహిళలు, స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2023-05-30-at-11.29.04-AM-1-1024x462.jpeg