మనోభావాలను దెబ్బ తీసే ఫ్లెక్సీలను తొలగించాలి: చీపురుపల్లి జనసేన డిమాండ్

  • అలా స్పందించని పక్షంలో ఆ ఫ్లెక్సీలు మేము తొలగిస్తాం

చీపురుపల్లి నియోజకవర్గం: వైసీపీ వారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా చీపురుపల్లి జంక్షన్, మరియు గరివిడిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలి, అలా లేని పక్షంలో వాటిని మేమే తొలగిస్తాం అని డి.ఎస్.పి, సీ.ఐ, చీపురుపల్లి, గరివిడి మండలాల ఎస్.ఐ లకు జనసేన పార్టీ తరుపున రిప్రజెంటేషన్ అందజేసారు. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటేశ్, బోడసింగి రామకృష్ణ, దన్నన యేసు, గెడ్డి గొల్ల బాబు, చందక బాలకృష్ణ, జగదీష్, గిడిజాల చిరంజీవి, సత్యనారాయణ, శంకర, విసినిగిరి శ్రీను, ధనుంజయ్, మురళీకృష్ణ, పెద్ది జగదీష్, వీరమహిళ పెద్ది రత్నం తదితరులు పాల్గొన్నారు.