‘ఉప్పెన’ సాంగ్ విడుదల చేసిన సూపర్ స్టార్
మెగా మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, అందాల భామ కృతిశెట్టి హీరోయిన్గా ఈ చిత్రంతో పరిచయం కాబోతున్న చిత్రం ‘ఉప్పెన’.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నుండి మూడో సాంగ్‌గా ‘రంగులద్దుకున్న… ‘ అనే సాంగ్‌ను సూపర్‌స్టార్ మహేశ్ విడుదల చేసి ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. సినిమాలో సాంగ్ విడుదల చేసిన మహేశ్‌కు నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ కారణంగా ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా విడుదలపై ఓ క్లారిటీ రానుంది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్‌ను దివంగత గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు అంకితమిచ్చారు.