ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

అగ్రిగోల్డ్ ఆస్తులు, ఖాతాదారులకు పరిహారం కేసులో ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కలెక్టరేట్‌ ద్వారా అర్హులైన డిపాజిటర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం..మార్చి 31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అగ్రిగోల్డ్‌ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిగింది. బదిలీ చేసే పాలన అధికారం తెలంగాణ హైకోర్టు సీజేకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం 2 వారాల గడువు కోరింది. వారి గడువుని తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. ఆస్తుల వేలంపై తమ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు దృష్టికి ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీఐ తీసుకొచ్చింది.