ముస్లింల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది: కటికం అంకారావు

గుంటూరు, ముస్లింల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… ముస్లింలకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. దులహాన్ పథకానికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు పథకాన్ని పూర్తిగా నిలిపివేయడం ముస్లింలని ధగా చేసినట్టే అని తెలియజేశారు. అమలు కాని హామీలతో మైనార్టీలని మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం అని ఆయన దుయ్యబట్టారు. ఇమామ్లకు మాల్విలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మా దగ్గర డబ్బులు లేవు, అందుకే పథకాలను అమలు చేయడం లేదని చెప్పడం,యావత్తు ముస్లిం సమాజాన్ని మోసం చెయ్యడమే అని ఆయన అన్నారు. ఇప్పటికైనా వైసిపిలో ఉన్న మైనార్టీ నాయకులు బయటకు వచ్చి, ముస్లిం సమాజానికి ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రిని నిలదీయాలని ఆయన కోరారు. అన్ని కులమతాలకు సమ న్యాయం జరగాలంటే జనసేన పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ గుంటూరు జిల్లా మెంబెర్ పసుమర్తి మణి, సలీమ్, ప్రసాద్, అజీస్, పరమేష్ తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.