Bobbili: జనసేనపార్టీ ఎదుగుదలను హరించాలని చూస్తే సహించేది లేదు – బాబు పాలూరు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి

బొబ్బిలి డివిజన్ DSP గారిని కలసి మన గెడ్డలిప్పి అల్లు రమేష్ బైక్ విషయంలో వైసిపి రౌడీ మూకల దారుణాన్ని ఉదహరిస్తూ వైసిపి మంత్రులు, MLAలు మరియు నాయకులు జనసేన పార్టీ పట్ల వ్యవహరిస్తున్న తీరుని వివరిస్తూ డివిజన్ పరిధిలో గల అన్ని మండలాల్లో గల వైసిపి కొంతమంది వైసిపి రౌడీ మూకలు, సమస్యాత్మక నాయకులను పిలిచి సరైన కౌన్సిలింగ్ ఇవ్వమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయో వారికి తెలియజేయాలని…ప్రజా సమస్యలు పట్ల పోరాటం చేసే మా లాంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు భద్రత కల్పించాల్సిన భాధ్యత ఈ ప్రభుత్వానిది మరియు పోలీసు శాఖదే అని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరుతో పాటుగా సీతానగరం మండల నాయకులు అల్లు రమేష్, పోతల శివశంకర్, సూర్యనారాయణ, త్రిలోక్, నిడగల్లు జనసైనికులు, ధర్మ, సంజు, సంచాన గంగాధర్, గార గౌరీ శంకర్ మరియు చిట్లి గణేష్ తదితర జనసైనికులందరూ పాల్గొన్నారు.