సోదరుని కోల్పోయిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో విషాదం నెలకొంది. న్యూయార్క్ లో ట్రంప్ తమ్ముడు, రాబర్ట్ ట్రంప్ శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ప్రకటించారు. గత కొంత కాలంగా రాబర్ట్ ట్రంప్ అనారోగ్యం బారిన పడ్డారు. అప్పటి నుంచి కూడా ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ట్రంప్ తమ్ముడు కన్నుమూయడoతో ట్రంప్ ఇలా స్పందించారు. “అతను నా సోదరుడు మాత్రమే కాదు, అతను నాకు మంచి స్నేహితుడు. అతను చాలా గొప్ప వ్యక్తి. కాని మేము మళ్ళీ కలుస్తాము. అతని జ్ఞాపకాలు నా హృదయంలో శాశ్వతంగా ఉంటాయి” అని ట్రంప్ పేర్కొన్నారు.