ట్విట్టర్ కే షాకిచ్చిన ట్రంప్!

మరో 10 రోజుల్లో ట్రంప్ అధికారం ముగియబోతోంది. ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ పగ్గాలను స్వీకరించనున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం అధ్యక్షుడిగా తన చివరి రోజుల్లో చెలరేగిపోతున్నారు. కాబోయే అధ్యక్షుడిని గుర్తించేందుకు ఆయన ఏమాత్రం ఇష్ట పడటం లేదు.

మరోవైపు ఆయన మద్దతుదారులు వాషింగ్టన్ లో హింసకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా మూసేసింది. ఆయన చేసే ట్వీట్ల వల్ల హింస మరింత పెరిగే అవకాశం ఉందనే భావనతో ఈ నిర్ణయం తీసుకుంది.

అయినప్పటికీ ట్రంప్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తన వ్యక్తిగత ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసినప్పటికీ… అమెరికా అధ్యక్షుడి అఫీషియల్ ఖాతా అయిన @POTUS నుంచి తాజాగా ట్వీట్ చేశారు. గొప్ప అమెరికన్ దేశభక్తులారా… మనం మౌనంగా ఉండబోము అని ఆయన అన్నారు. సొంతంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను డెవలప్ చేయించాలనుకుంటున్నట్టు తెలిపారు. ఈ ట్వీట్ తో ట్విట్టర్ షాక్ కు గురైంది. వెంటనే ఆయన ట్వీట్ ను తొలగించింది.