ట్రంప్‌ ఫేస్‌బుక్‌ ఖాతా రెండేళ్ల పాటు నిలిపివేత

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ఖాతాను ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ శుక్రవారం దాదాపు రెండేళ్ల పాటు నిలిపివేసింది. జనవరి 2023 వరకు ఆయన ఖాతా నిలిచిపోనుంది. భవిష్యత్తులో పలు దేశాధినేతలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే సంస్థ ఎలా వ్యవహరిస్తోందనే సంకేతాలను నిశితంగా పరిశీలించేందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది జనవరి 6న యుఎస్‌ క్యాపిటల్‌ వద్ద జరిగిన ఘర్షణలకు.. ఆయన పోస్టులు ప్రేరేపితం చేసిన నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాలు చేపట్టింది. మే నెలలో సంస్థ స్వతంత పర్యవేక్షణ బోర్డు కూడా ట్రంప్‌ ఖాతా నిలుపుదలను సమర్థించింది. అయితే నిరవధిక రద్దుపై తోసిపుచ్చిన బోర్డు.. సరైన వివరణనిచ్చేందుకు ఆరు నెలల గడువునిచ్చింది. జనవరి నుండి ట్రంప్‌ సోషల్‌ మీడియా ఖాతా నిలిపివేయగా…షరతులకు లోబడితేనే గడువు తర్వాత తిరిగి అనుమతినిస్తామని ఫేస్‌బుక్‌ బ్లాగ్‌లో పోస్ట్‌ చేసింది. ట్రంప్‌ చర్యలు మా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించారని విశ్వసిస్తున్నామని, ఇది కొత్తగా అమలు చేసిన ప్రోటోకాల్స్‌ కిందకు వర్తిస్తున్న నేపథ్యంలో జరిమానా విధించడం సరైన నేపథ్యంలో ఆయన ఖాతా నిలిపివేసినట్లు పేర్కొంది.