భారత్‌కు రానున్న ‘స్పుత్నిక్ వీ’ రెండో బ్యాచ్ వ్యాక్సిన్‌లు

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకా రెండో బ్యాచ్ డోసులు రేపు భారత్‌కు చేరుకోనున్నాయి. ఇప్పటికే ఈ నెల 1న తొలి బ్యాచ్ టీకాలు భారత్‌కు వచ్చాయి. రష్యా నుంచి అత్యవసర సమయాల్లో స్పుత్నిక్-వీ టీకాలను భారత్‌కు దిగుమతి చేసుకోవడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెడ్డీస్ ల్యాబోరేటరీస్ బ్యాచ్‌ల వారీగా టీకాలను దిగుమతి చేసుకుంటున్నది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మూడో దశ వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయడం కోసం విదేశీ వ్యాక్సిన్‌లకు భారత్ అనుమతిస్తోంది.