తుంగభద్ర పుష్కరాలు.. పాటించాల్సిన మార్గదర్శకాలు

ఈ నెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు తెలంగాణలో కొనసాగే తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. 12 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పుష్కరాల నిర్వహణ ఉంటుందని తెలిపింది. పదేళ్ల లోపు పిల్లలు, గర్భిణీలు, 65 ఏళ్ల పైబడినవారు పుష్కరాలకు రావొద్దని సూచించింది. కరోనా నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారికే పుష్కర ఘాట్‌లోకి అనుమతిస్తామని వెల్లడించింది. టెస్టు రిపోర్టు లేకుండా వచ్చే వారికి థర్మల్ స్కీనింగ్ అనంతరం అనుమతి ఇవ్వనున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి పుష్కరఘాట్‌కు అనుమతి నిరాకరించనున్నారు. మాస్కు ధరించడం, ఆరు అడుగుల భౌతిక దూరం తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం.