చైనాకు మరో భారీ షాక్ ఇస్తూ మరో రెండు వెబ్‌సైట్స్ బంద్…

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు బుద్ది చెప్పేందుకు మోదీ ప్రభుత్వం డిజిటల్ స్ట్రైక్స్ ముమ్మరం చేసింది. ఇప్పటికే 225 యాప్స్ తో పాటు పలు మొబైల్ గేమ్స్ పై నిశేధం విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా చైనాకు చెందిన రెండు వెబ్ సైట్స్ ను కూడా బ్యాన్ చేసింది. ఇకపై భారతదేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ చైనా ఇంగ్లీష్ వెబ్‌సైట్‌ను టెలికమ్యూనికేషన్ విభాగం నిషేధించింది. అయితే  చైనా నిర్వహిస్తున్న Global Times అధికారిక వార్తా సంస్థ Xinhua (చైనా) ను ఇప్పటికీ యాక్సెస్ చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను తెరిచినప్పుడు, ‘మీరు కోరిన URL భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం నిర్దేశించిన విధంగా బ్లాక్ చేయబడింది. మరింత సమాచారం కోసం నిర్వాహకుడిని సంప్రదించండి. అని సందేశం వస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత, చైనా సైన్యాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలకు బుద్దిచెప్పే నేపధ్యం లో చైనా మొబైల్ యాప్స్ ను భారత్ పెద్ద ఎత్తున నిషేధించింది. ఇందులో ప్రముఖ మొబైల్ యాప్ టిక్ టాక్ అలాగే పబ్ జీతో సహా సుమారు 200కు పైగా యాప్స్ ఉన్నాయి.