కేంద్రానికి రైతు సంఘాల ఆల్టిమేటం

ల్ల చట్టాలను రద్దు చేయాలంటూ 11 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న రైతు సంఘాలు తాజాగా కేంద్రానికి ఆల్టిమేటం జారీ చేశాయి. కేంద్రానికి నవంబ్‌ 26 డెడ్‌లైన్‌ విధించాయి.   నవంబర్‌ 26 నాటికి నల్ల చట్టాలను రద్దు చేయాలని లేదా మరో రౌండ్‌ చర్చల కోసం రైతులకు పిలుపునివ్వాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) నేత రాకేష్‌తికాయత్‌ కేంద్రానికి స్పష్టం చేశారు. లేకుంటే గ్రామాల నుండి రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దులను చుట్టుముడతారని హెచ్చరించారు. గతేడాది నవంబర్‌ 26న రైతులు నిరసనలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.