పులికొండ గ్రామంలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలి

  • జనసేన పార్టీ నాయకుడు చిప్పగిరి రాజశేఖర్

కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకుడు చిప్పగిరి రాజశేఖర్ సొంత గ్రామమైన పులికొండలో తల్లిదండ్రులు చిప్పగిరి వెంకటేశ్వర్లు, వెంకటరమణములు, పులికొండ గ్రామంలో నివాసం ఉంటూ సచివాలయం సమీపాన కిరాణా షాపు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కిరాణా షాప్ కి నిప్పంటించారు. దీంతో కిరాణా షాప్ లో ఉన్న సుమారు 23,200తో పాటు, కిరాణా వస్తువులు ఖాళీ బూడిద అయ్యాయి. అందువలన దాదాపు లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది, అయితే గ్రామంలో కొందరు రాజకీయ కక్షతో చేశారా లేక వ్యక్తిగతంగా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అన్నది అనుమానంగా ఉంది. ప్రశాంతంగా ఉన్న పులికొండ గ్రామంలో ఇలాంటి సంఘటనలతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి సంఘటనలు మరోసారి ఇలాంటి పునరుద్ధరణ కాకుండా గ్రామాలలో పోలీసు నిగా పెట్టి మరొకరికి ఇలాంటి అన్యాయం సంఘటనలు జరగకుండా చూడాలని రాజశేఖర్ కోరారు.