Afghanistan: అమెరికా అధ్యక్షుడిది తెలివైన నిర్ణయమన్న ఇమ్రాన్‌ఖాన్‌

ఆఫ్ఘనిస్తాన్‌ నుండి అమెరికా బలగాల ఉపసంహరణను పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ సమర్థించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తెలివైన నిర్ణయం తీసుకున్నారని.. అయితే బైడెన్‌ అన్యాయంగా విమర్శలకు గురవుతున్నారని అన్నారు. రష్యా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ఖాన్‌ మాట్లాడుతూ.. బైడెన్‌ తెలివైన పనిచేశారని అన్నారు. అమెరికా వైఫల్యానికి కారణం పాకిస్తానే అంటూ వ్యాఖ్యలు చేసిన అమెరికా అధికారులపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్‌లకు పాకిస్తాన్‌ సహకారం అందించిందంటూ గతంలో అమెరికా సభ్యులు విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. ఒక పాకిస్తానీయుడిగా కొందరు సెనేటర్స్‌్‌ చేసిన వ్యాఖ్యలకు తాను ఆందోళన వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఆఫ్ఘన్‌లో అమెరికా పరాజయానికి పాకిస్తాన్‌ను నిందిచడం బాధాకరమైన విషయమని అన్నారు.