జనసేన క్రియాశీలక సభ్యత్వం ఉపయోగించుకోండి : లక్ష్మి కుమార్ గౌడ్

జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోరుతూ 500-/- రూపాయలకే 5,00,000-/-లక్షల ప్రమాద భీమా ప్రమాదవశాత్తు వైద్యశాలలో చేరితే 50,000-/-రూపాయలు వరకు వచ్చేటట్టు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అనంతసాగరం మండల జనసేన నాయకులు లక్ష్మి కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ తమ కార్యకర్తల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి జనసేన కార్యకర్త ఉపయోగించుకోవాలి. 21-02-2022 మొదలైన మలిదశ జనసేన క్రియాశీలక సభ్యత్వం 07-03-2022 ముగినంది కావున ముఖ్యంగా యువకులు కచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరారు .