ఎల్‌పీజీ వాట్సాప్ సేవలు.. సెకన్లలో గ్యాస్ సిలిండర్ బుకింగ్ సౌకర్యం..

ఎల్‌పీజీ వినియోగదారులకు ఇండేన్ గ్యాస్ కంపెనీ శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఆ కంపెనీ పలు విధానాల్లో గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫోన్ చేయాల్సిన పని లేకుండానే సులభంగా సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇండేన్ కంపెనీ ఇప్పుడు తన కస్టమర్లకు వాట్సాప్ ద్వారా కూడా సేవలు అందిస్తోంది. ఇకపై వినియోగదారులు భారత్ గ్యాస్ సిలిండర్, ఇండేన్ గ్యాస్ సిలిండర్, హెచ్‌పీ గ్యాస్ ఇలా మీరు ఏ సిలిండర్ వాడుతున్నా కూడా వాట్సాప్ ద్వారా సులభంగానే క్షణాల్లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని భావించే వారు ముందుగా మీ గ్యాస్ సిలిండర్ కంపెనీని మొబైల్ ఫోన్‌ లో సేవ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాలి. సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుక్ అయిపోతుంది. మీకు మళ్లీ రిప్లే కూడా వస్తుంది.

భారత్ గ్యాస్ ఉపయోగించే వారు 1800224344 నెంబర్ ను వారి మొబైల్ ఫోన్‌ లో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ లోకి వెళ్లి హాయ్ లేదా హెలో అని మెసేజ్ పెట్టాలి. తర్వాత మీకు రిప్లే వస్తుంది. తర్వాత మీరు సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అదే మీరు ఇండెన్ గ్యాస్ వాడితే.. 7588888824 అనే నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ లోకి వెళ్లాలి. ఇప్పుడు రీఫిల్ బుకింగ్ అని మెసేజ్ పెట్టాలి. క్షణాల్లోనే మీ సిలిండర్ బుక్ అవుతుంది. హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ వాడే వారు 9222201122 నెంబర్ ద్వారా వాట్సాప్‌ లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే వాట్సాప్ ప్రొఫైల్‌లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎలా చేయాలనే వివరాలు ఉంటాయి. వినియోగదారులు వాటిని ఫాలో అవ్వాలి.