“వారాహి యాత్ర” ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది: మాదాసు నరసింహ

రైల్వే కోడూరు: జనహితం కోరే జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న “వారాహి యాత్ర” విజయవంతం కావాలని చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు నరసింహ పిలుపునిచ్చారు, ఆదివారం చిట్వేలి మండలం జనసేన పార్టీ కార్యాలయంలో వారాహి పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాదాసు నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం, నూతన అధ్యాయ నిర్మాణం కోసం, ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేసేందుకు వారాహి యాత్రను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14వ తారీకు నుండి అన్నవరం సత్యదేవుడి దర్శనం అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించబోతున్నారు, కేవలం ఎన్నికల కోసమే ఈ యాత్ర కాదు, ప్రజల బాధలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వారితో మమేకమైఎందుకు, ఇదో చరిత్రలో నిలిచిపోయే యాత్ర కాబోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనిశ్చితి పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందే అని ఆశాభావంతో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇంకా అనేక వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి గానే ఆత్మహత్య చేసుకున్న వేలాది మంది కౌలు రైతు కుటుంబాలకు ఆపన్నహస్తం అందిస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే శక్తిని అందజేస్తే ఇంకెంతో మందికి ఉపయోగకరమైన సేవలు అందిస్తారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందని. ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా, అప్పులను అదుపు చేస్తూ, అభివృద్ధి బాటలు వేయగల సమర్థ నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ అనే భావన ప్రజల్లో బలంగా ఉందని. రాష్ట్ర పరిపాలన విధానాల్లో ఖచ్చితమైన జవాబుదారితనం జనసేనతో మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారని వ్యాఖ్యానించారు, ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు పురం సురేష్, కంచర్ల సుధీర్ రెడ్డి, మాదాసు శివ, ఆనందల తేజ, షేక్ రియాజ్, తుపాకుల పెంచలయ్య, పగడాల శివ, మోడెం చిరంజీవి, సాంబయ్యగారి నరసింహ, సువ్వారపు భాను ప్రకాష్, సువ్వారాపు హారి, మాదినేని రాజా, పురం గిరి పెద్దంగారి సాయి, పసల శివ, కడుమూరి సుబ్రమణ్యం, ముత్యాల మహేష్, మోపురు ప్రకాష్, పొన్న రెడ్డి, సతీష్ రెడ్డి, సిరిగిరి సుధా, పవన్ రెడ్డి, గందంశెట్టి వెంకటేష్, సంతోష్, పగడాల సుదర్శన్, సుంకర తేజ తదితరులు పాల్గొన్నారు.