“వారాహి యాత్ర” ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది: గౌతమ్ కుమార్

  • మరి కొద్ది రోజుల్లో నియోజక వ్యాప్తంగా ప్రతి పల్లెకు ఇంటి ఇంటికి జనసేన కార్యక్రమం

ఉరవకొండ నియోజకవర్గం: జనహితంకోరే జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న “వారాహి యాత్ర” విజయవంతం కావాలని ఉరవకొండ పట్టణం, పార్క్ నందు గల శ్రీ అభయాంజనేయ స్వామి పాదాల చెంత ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిస్వార్థ జనసైనికుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం, ఓ నూతన అధ్యాయ నిర్మాణం కోసం, ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేసేందుకు వారాహి యాత్రను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జూన్ 14వ తారీకు నుండి అన్నవరం సత్యదేవుడి దర్శనం అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించబోతున్నారు, కేవలం ఎన్నికల కోసమే ఈ యాత్ర కాదు, ప్రజల బాధలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వారితో మమేకమైఎందుకు, ఇదో చరిత్రలో నిలిచిపోయే యాత్ర కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనిచ్చితి పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందే అని ఆశాభావంతో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇంకా అనేక వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి గానే ఆత్మహత్య చేసుకున్న వేలాది మంది కౌలు రైతు కుటుంబాలకు ఆపన్నహస్తం అందిస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే శక్తిని అందజేస్తే ఇంకెంతో మందికి ఉపయోగకరమైన సేవలు అందిస్తారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందని. ప్రజాధనం ధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా, అప్పులను అదుపు చేస్తూ, అభివృద్ధి బాటలు వేయగల సమర్థ నిజాయితీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అనే భావన ప్రజల్లో బలంగా ఉందని. రాష్ట్ర పరిపాలన విధానాల్లో ఖచ్చితమైన జవాబిదారితనం జనసేనతో మాత్రమే సాధ్యమవుతుందని ప్రజల అభిప్రాయ పడుతున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం జనసేన కార్యాలయం నందు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలొస్ ఉరవకొండల మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మరి కొద్ది రోజుల్లో నియోజక వ్యాప్తంగా ప్రతి పల్లెకు ఇంటి ఇంటికి జనసేన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, కార్యక్రమంలో భాగంగా జనసేన సిద్దాంతాలు, షణ్ముఖ వ్యూహం, ప్రజలలో మరింతగా తీసుకెళ్లే విధంగా, ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా ఉంటుందని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్ర శేఖర్, విడనపనకల్ అద్యక్షులు గోపాల్, వజ్రకరూరు అద్యక్షులు కేశవ, బెలుగుప్ప అద్యక్షులు సుధీర్, కుడేర్ అద్యక్షులు నగేష్, నాయకులు దేవేంద్ర, రాజేశ్, రమేష్, హరి శంకర్ నాయక్, మల్లేష్ గౌడ్, మళ్లి కర్జున, మని, ప్రియతమ, రూప నాయక్, ఏర్రిస్వామి, సూర్య నాయక్, బోగేష్ పాల్గొన్నారు.