వాయల్పాడు జనసేన మండల కమిటీ అంతర్గత సమావేశం

పీలేరు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన తరువాత ఆదివారం వాయల్పాడు మండలంలోని జర్రావారి పల్లిలో మండల అధ్యక్షుడు మండెం కిషోర్ అధ్వర్యంలో మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పీలేరు నియోజకవర్గ ఇంచార్జి బెజవాడ దినేష్ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి హాజరవడం జరిగింది. సమావేశంలో బెజవాడ దినేష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం అని చెబుతూ అందుకోసం వాయల్పాడు మండలంలో జనసేన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీతో కలిసి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో మండల జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ ఎలా ఏర్పాటు చేయాలో దిశా నిర్దేశం చేయడం జరిగింది. పొత్తులో భాగంగా పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేసి దుర్మార్గపు వైసిపి పార్టీని గద్దె దించే దిశగా పనిచేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అమ్మిట్టి సందీప్, తుమ్మల మహేష్, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్, రెడ్డెప్ప బాలు(పత్తేపురం), నవీన్ కుమార్, లోకేష్. కార్యదర్శులు బాలరాజు, ప్రశాంత్, యుగంధర్, భాను, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.